మతోన్మాదాన్ని రెచ్చగొట్టే బీజేపీని ఓడించాలి

– రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీ
– గడ్డం రంజిత్‌ రెడ్డి
– మండలంలో గ్రామ గ్రామానా ప్రచారం
నవతెలంగాణ-కందుకూరు
కార్పొరేట్లకు మోడీ ఈ దేశాన్ని తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీని ఓడించడానికి ప్రజల సిద్ధంగా ఉండాలని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని సరస్వతి గూడ, లే మూరు, తిమ్మాపురం, రాచులూరు, గూడూరు, పులి మామిడి, నేదునూరు, గ్రామాల్లో చేతి గుర్తుకు ఓటు వే యాలని ఇండియా కూటమిని బలపరచాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..10 ఏండ్ల పాలనలో ప్రధాని మోడీ, ప్రజల బాధలు తీర్చలేదని, ఈ దేశాన్ని కార్పొరేట్లకు దాసోహం చేశారని విమర్శించారు. ఓ పక్క మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కోట్ల మంది ప్రజలకు పౌష్టికహారాన్ని అం దించలేని మోడీకి పరిపాలించే అర్హత లేదన్నారు. రా జ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రమాదమేర్పడిందని 10 ఏండ్ల మోడీ పాలనలో నియంతృత్వం, రాజ్యమేలుతుం దని చీకటి పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై ఉక్కు పాదాన్ని మోపుతూ, సీఏఏ ఎన్‌ ఆర్సీ, ఎన్‌పీఆర్‌, పేరుతో మైనార్టీలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. కోట్లాదిమంది ప్రజలు ఆకలి, దరిద్రం, నిరుద్యోగంతో బాధపడుతుంటే ప్రధాని మాత్రం పిడేలు వాయిస్తున్నాడని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ అధి కారం చేపట్టి రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారని ఆరోపించా రు. బీజేపీను, బీఆర్‌ఎస్‌ను చిత్తూ చిత్తుగా ఓడించాలని కోరారు. చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మహేశ్వ రం నియోజకవర్గం ఇన్‌చార్జి కిచెన్న గారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా చైర్‌ పర్సన్‌ తీగల అనితా రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు ఏ నుగు జంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఇన్‌చార్జి శా రద, కృష్ణానాయక్‌, సత్యనారాయణ, సరికొండ మ ల్లేష్‌, ఢిల్లీ శ్రీధర్‌, కప్పాటి పాండురంగారెడ్డి, వైస్‌ ఎంపీపీ గం గుల శమంత ప్రభాకర్‌ రెడ్డి, ఇంద్ర కంటి రాకేష్‌ గౌడ్‌, ఎగిరి శెట్టి నరసింహ, సోలిపేట అమరేందర్‌ రెడ్డి, బోర్ర సురేష్‌, , గడిగ రాములు, దేవరకొండ రాములు, జి సు రందర్‌ రెడ్డి, పడమటి సురేందర్‌ రెడ్డి, అంకగళ్ల సంజీవ, దర్శన్‌ వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love