దళితుల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

– మాజీ మంత్రి, జహీరాబాద్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌
– బూట్లు తుడిచి.. ఓట్లు అడిగి
నవతెలంగాణ-జహీరాబాద్‌
చరిత్రను ఎట్లా తిరగరాసిన దళితుల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని మాజీమంత్రి డాక్టర్‌ ఏ.చంద్ర శేఖర్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కర్‌ కూతురు సోషల్‌ మీడియా ఇన్చార్జి డాక్టర్‌ గిరిజ షెట్కర్‌తో కలిసి శనివారంఎస్సీ సెల్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ రహదారి 65పై ర్యాలీ నిర్వహించారు. అనరతరం షెట్కర్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమా వేశంలో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. తాను శాసనసభ్యుడిగా గెలిచి ఉంటే నేడు జహీరాబాద్‌కు మంత్రి వర్గంలో స్థానం ఉండేదన్నారు.ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సురేష్‌ కుమార్‌ షెట్కర్‌ను గెలిపించుకోవాలన్నారు. దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదేం డ్లు కేసీఆర్‌ మాటలకు మోసపోయి ఓటేశారని..మరోసారి అలాంటి పోరాపాటు చేయొద్దన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం మార్చేసే హక్కు పొందుతారన్నారు. దేశం లో మళ్లీ రాజరీకం, రాజుల పాలనల చేసేందుకు బీజేపీ కు ట పన్నుతున్నదని ఆరోపించారు. మందకష్ణ మాదిగను మోడీ బుట్టలో వేసుకొని.. దళితులందరూ బీజేపీకే ఓటేస్తార న్న భ్రమలో ఉన్నారన్నారు. కానీ అభివృద్ధికి బాటలు వేయని బీజేపీకి ఓటెయ్యొద్దన్నారు.నాటి నుంచైనా పేదలకు ఇండ్లు, భూములు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్నారు. కాబట్టి సురేష్‌ షెట్కార్‌కు ఓటేసి గెలిపించాలన్నారు.
బూట్లకు పాలిష్‌ చేస్తూ..
ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చంద్రశేఖర్‌ బూట్లు పాలిష్‌ చేస్తూ ప్రచారం చేయడం గమనార్హం. బీజేపీ, బీఆర్‌ఎస్‌లో మాయంలో పడకుండా.. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ మాదిగ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం అసెంబ్లీలో మొట్టమొదట మాట్లాడిన ఘనత డాక్టర్‌ ఏ చంద్రశేఖర్‌కే దక్కుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మందకష్ణ మాదిగ మాదిగల పక్షాన కనీసం ప్రచారం చేయ లేకపోయారని, నేడు బీజేపీకి ఊడిగం చేస్తూ హెలిక్యాప్టర్‌తో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బాబు జగ్జీవన్‌ రామ్‌ను మంత్రిని చేసిందని, మీరా కుమారిని స్పికర్‌ గా చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దామోదర రాజ నర్సింహను డిప్యూటీ సీఎం చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బీజేపీతో సాధ్యం కాదని.. బీజేపీలో మాయలో పడొద్దన్నారు. టీపీసీసీ సోషల్‌ మీడియా కన్వీ నర్‌ డాక్టర్‌ గిరిజా షెట్కర్‌ మాట్లాడుతూ.. అంటరాని తనాన్ని నిర్మూలించింది కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు గజ్జెల కాంతం, గూట్ల వరప్రసాద్‌, కూసపాటి శ్రీను, హనుమంతరావు పాటిల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, నరసింహారెడ్డి, మహమ్మద్‌ బాక్సుద్‌ ,ఖాజా మియా, మహమ్మద్‌ అక్బర్‌, రాములు యాదవ్‌, భీమ న్న, సాయిలు, లింగారెడ్డి, అశోక్‌, పెంటన్న, సతీష్‌ వివిధ మండలాల అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love