సేవతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి

– షాహిన్‌ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ ఫరాన్‌
నవతెలంగాణ-జహీరాబాద్‌
సేవతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో తమ షాహిన్‌ సంస్థ శాయశక్తుల్లా కృషి చేస్తున్నదని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ ఫరాన్‌ అన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాశాలలో మహమ్మద్‌ సమీర్‌, జహీరాబాద్‌ కళాశాలలో సఫా మహ్రిన్లు రాష్ట్రంలో ప్రథమ ద్వితీయ ర్యాంకులు సాధించారని.. ఇది ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థు లను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో తాము పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అంది స్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం షాహిన్‌ టాలెంట్‌ టెస్ట్‌ ను నిర్వహించి.. ఆ టెస్ట్‌లో ప్రథమ ద్వితీయ తతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రెండేండ్ల పాటు ఉచిత విద్యతోపాటు రూ.1.20లక్షల స్కాలర్షిప్‌ను సైతం అందిస్తున్నామన్నారు.ఆ విద్యార్థులు ఇంటర్‌ మొదటి ద్వితీ య సంవత్సరంలో రాష్ట్రస్థాయి ర్యాం కులు సాధిస్తే వారికి ఉచితంగా ఉమ్రా, హజ్‌ యాత్రకు పంపిస్తామని.. ఆ మేరకు ధవీకరణ పత్రాలను అందజే శారు. రాష్ట్రంలో మొద టి ర్యాంకు సాధించిన సమీర్‌ది నిరుపేద కుటుంబమని.. ఆయన తండ్రి ఆటో నడిపిస్తుం డగా.. తల్లి ఇంట్లో బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తు న్నారన్నారు. విద్యార్థి పట్టుదలతో పాటు.. ఉపాధ్యాయుల కృషి ఫలితంగా నేడు మంచి ర్యాంకు వచ్చిందన్నారు. అలాంటి విద్యార్థులకు తమ విద్యాసంస్థలు ఎల్లవేళలా అండగా ఉంటాయన్నారు. కాగా మొదటి సంవత్సరంలోనే 400పైన మార్కుల సంపా దిం చిన 84 మంది, 430 మార్కులు సం పాదించిన 21 మంది విద్యార్థులకు అభినందనలు తెలిపా రు. ఈ సమావేశంలో సంగారెడ్డి, జహీరాబాద్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ, మహమ్మద్‌ జుబేర్‌, ప్ర ధానోపాధ్యాయుడు ఎక్బాల్‌ గాజీతదితరులు పాల్గొన్నారు.

Spread the love