ప్రేమ పల్లకి

నేను ఎక్కడ ఉన్నా
నీ తలంపుతోనే ఉన్నా
నా మదిలో నిన్ను ప్రతిష్టించు కున్నా
నా రాగానికి, నా తాళానికి
నాట్య మయూరివి నీవే
నీ అందియల చప్పుడు
నా గానానికి హరమై
నాకు ప్రేమ దేవతవై
అను క్షణం నిను తలుస్తూ
నీ పాదాలు కంది పోకుండా
ప్రేమ పల్లకి లో నిను ఊరేగిస్తూ
నేను బోయనై పల్లకి మోస్తూ
నీ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ
నా ఊహల లోకంలో
నా కలల ప్రపంచంలో
తేలి పోతూ ఉన్నా
నా ప్రియురాలి దర్పాన్ని చూస్తూ
ప్రేమ పల్లకిని మోస్తూ
– కనుమ ఎల్లారెడ్డి
93915 23027

Spread the love