మధురానుభూతి

మేఘాల తాకిడికి మధురమైన మెరుపు వచ్చినట్టు
మరుపేరాని నా మనసుకి ఊహల అలజడి తాకింది
ఆ అలజడి రేగిన అందాల తపస్వి ఈ అపురూప బొమ్మ
అపురూప కోవెలలో వెలసిన చక్కనమ్మ
చిలిపి నవ్వుల దమయంతి
చిరునవ్వుల కల్పవల్లి
యువరాణి యశస్సు
రాజ్యమెలే మేధస్సు
ఈ చిరు కోకిల దారి మరచిపోయిందేమో
నా ఊహల రహదారిలో పయనం చేస్తుంది
నా గుండె గదిని తన అందాలతో అలంకరించింది
కోమలమైన తన హస్తాలతో నా మనసుని తాకి
నా కనుల కునుకు చెరిపేసింది
స్వర్గలోక స్వప్న సుందరా తను
లేదా కోనసీమ కోయిలమ్మనా
మదు మధుర ఆమె గొంతు తేనెల విందు
తన్మయపరిచే తన అందాలు బందావన మందిరాలు
ఆకాశమంత పల్లకిలో ఆమెను ఊరేగించి
నా ప్రేమ రాజ్యానికి రాణిగా ప్రకటిస్తాను…
– పోలగాని భానుతేజశ్రీ

Spread the love