ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, దీనికి సంబంధించి ఇసుక రవాణ చేస్తున్న వాహనాలతో పాటు ఫొటోలు, తేదీ, సమయంతో కూడిన ఆధారాలను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నాగేంద్ర కుమార్ సుప్రీం కోర్టు ముందు ఉంచారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

Spread the love