సైరికుడు

పెనుగాలిని సైతం ధిక్కరించే
ఆ గడ్డి పరక నడుగు చెబుతుంది
ఆ బక్క చిక్కిన దేహంలో ఉన్న ధైర్యమెంతో …
గలగలా నవ్వే ఆ పైరునడుగు చెబుతుంది
ఆ చేతి గాజులు చేసే
సవ్వడి లయ మధురమెంతో…….
బండెడు బరువులు లాగే
ఆ బసవన్న నడుగు చెబుతుంది
పదిమంది కడుపు నింపే
ఆ పైరు కాపు పస్తులెన్నో……
బండ బారిన బీడు భూమిని చీల్చే
ఆ అరకనడుగు చెబుతుంది
చితికిపోయిన ఆ దేహానికి
ఉన్న గాయాలెన్నో….
నీ కంచంలో మెరిసే
ఆ తెల్లని మెతుకునడుగు చెబుతుంది
కుటుంబ భారాన్ని మోయలేక
అలసిపోయి పురుగుల మందుతో
సేదతీరే రైతుల కష్టాలెన్నో……..!!!!!!
– ఎం. కురుమయ్య యాదవ్‌
7799553493

Spread the love