కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
కాటేదాన్‌ చెత్త డంపింగ్‌ యార్డ్‌లో రాంకీ సంస్థ కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకుని వారికి కనీస వేతనాలు సదుపాయాలు కల్పించడం లేదని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రకుమార్‌ ఆగ్రహం వ్య క్తం చేశారు. శనివారం హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ మున్సి పల్‌ సాలిడ్‌ వేస్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు బాలకృష్ణ, మోహన్‌ అధ్యక్షతన కాటేదాన్‌ చెత్త డంపింగ్‌ యార్డ్‌ పనిచేసే కార్మికుల సమావేశంలో రుద్ర కుమార్‌, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు కురుమయ్య ము ఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఇక్క డ పనిచేస్తున్న కార్మికులందరు ఉదయం నుండి మధ్యా హ్నం సమయం దాకా హెవీ వెహికల్స్‌, మినీ వెహికల్స్‌ డ్రైవర్స్‌ హెల్పర్స్‌గా పని చేస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరందరికీ కనీసం భోజనం చేసే సమయం లో క్యాంటీన్‌ వసతి, బాత్రూమ్స్‌, విశ్రాంతి గది లేవన్నా రు. సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఐడీ కార్డ్స్‌, సేఫ్టీ పరికరాలు, ఇన్సూరెన్స్‌ కనీస సౌకర్యాలూ లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వం ఇవేమీ పట్టిం చుకోకుండా రాంకీ సంస్థకు అవార్డులు రివార్డులు ప్రకటి స్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులందరూ ఐకమత్యంతో పోరాడితే ఈ సమస్యలన్నీ త్వరలో సీఐటీ యూ ఆధ్వర్యంలో పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పర్మనెంట్‌ డ్రైవర్స్‌, హెల్పర్స్‌ పాల్గొన్నారు.

Spread the love