ఎట్టకేలకు భారత నావికులకు విముక్తి..

నవతెలంగాణ – హైదరాబాద్; ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను గత నెల ఇరాన్‌ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. పర్షియన్‌ గల్ఫ్‌లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో పలువురు భారతీయ నావికులు కూడా ఉన్నారు. దాదాపు నెల రోజుల తర్వాత వీరిలో కొందరికి ట్రెహాన్‌ తాజాగా విముక్తి కల్పించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది.‘‘ఎంఎస్‌సీ ఏరిస్‌లోని భారత సిబ్బందిలో ఐదుగుర్ని విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్‌ చేసే ప్రయత్నాలకు ఇరాన్‌ అధికారుల నుంచి సహకారం లభిస్తోంది’’ అని దౌత్యకార్యాలయం పేర్కొంది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్‌, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్‌ నిన్న విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Spread the love