Thursday, September 4, 2025
E-PAPER
spot_img

ఛీ.. ఛీ..

- Advertisement -

నేను రాజునైతే
నీవెప్పుడూ దోషివే
నీవు దోషిగా ఉంటేనే
నాకు సింహాసనం
నిన్ను దోషిగా నిలబెట్టి
చూపడమే నా పాలన
అరెస్టులు…ఉద్యమాలు
అంత అవసరమా..!
చప్పుడు కాకుండా
మట్టుపెడ్తే పోలా..?
అంతా నిశ్శబ్దం..
నోర్మూసుకు పడుండాలా..
ప్రశ్నిస్తే ఎలానూ జైలు
ప్రజాస్వామ్యం…
అదో పెద్దమాయ
నటించే నక్క వినయం
ఛీ..ఛీ..
జైలు నుండి పాలనా?
ఎంత నామోషి?
మహాత్ములు మండేలాలు
జైలు జీవితాలు బూటకం
ధర్మస్థాపనే పుణ్యకార్యం
పాపులే జైళ్లకు పోతారు
పుణ్యాన్ని రక్షించాలిగా
(అ)ధర్మో రక్షతి రక్షతి:
-కె.శాంతారావు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad