Tuesday, March 3, 2026
E-PAPER
Homeకరీంనగర్మున్సిపల్ కార్యాలయంలో హోలీ వేడుకలు

మున్సిపల్ కార్యాలయంలో హోలీ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఆవరణలోసోమవారం జరిగిన హోలీ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ  మాట్లాడుతూ.. హోలీ పండుగ అనేది కేవలం రంగుల పండగ మాత్రమే కాదు ఇది మనుషుల మధ్య మానవత్వాన్ని ప్రేమ అనురాగాన్ని ఆప్యాయతలు ఐకమత్యాన్ని పెంపొందించే సాంస్కృతిక వేడుక అని అన్నారు.  చెడు లక్షణాలను వదిలించుకొని మంచి లక్షణాలతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు గడపాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.

ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు పుర ప్రముఖులకు సిరిసిల్ల  ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా పర్యావరణానికి అనుకూలమైన రంగులను వాడుతూ ఈ హోలీ పండుగ సంతోషంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు . కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్,కౌన్సిలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -