నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలో హోలీ పండుగను గ్రామ ప్రజలు ఘనంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కాటారం గ్రామపంచాయతీ సర్పంచ్ పంతకాని సడవలి , వార్డ్ సభ్యులు, స్థానిక ప్రజలు పరస్పరం రంగులు చల్లుకుంటూ సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పంతకాని సడవలి మాట్లాడుతూ, కులమతాలకతీతంగా ప్రేమానురాగాలతో, స్నేహభావంతో జరుపుకునే గొప్ప పండుగ హోలీ అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పండుగగా హోలీ ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. హోలీ సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, ముఖ్యంగా చిన్నపిల్లల కళ్లలో రంగులు పడకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండగొర్ల బాణయ్య , వార్డ్ సభ్యులు కొండ రాయమల్లు, రవి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, యువత, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.



