Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఘనంగా హోళీ సంబరాలు 

మండలంలో ఘనంగా హోళీ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర 
రంగుల పండుగ హోళీ సందర్భంగా మండలంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. గ్రామాల్లోని యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు. గ్రామ ప్రధాన వీధుల్లో డీజే మ్యూజిక్ మధ్య యువకులు నృత్యాలతో హోళీ సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చారు. పెద్దలు చిన్నారులకు ఆశీర్వాదాలు అందిస్తూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. కొన్ని చోట్ల సంప్రదాయ పూజలు నిర్వహించి గ్రామ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -