ఆత్మీయులకు బహుమతిగా ఇచ్చే కనుక
నవతెలంగాణ – నసురుల్లాబాద్
హోలీ పండుగ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కామదహనం. తెల్లారితే రంగులతో ఒకరికొకరు సరదాగా పూసుకుని ఆనందంగా పండుగ జరుపుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వయసుకు తారతమ్యాలు లేకుండా రంగుల్లో తేలియాడుతూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెబుకుంటారు. సాయంత్రం కుటుంబాల్లో ఉన్న పిల్లలకు హోలీ పండుగ సందర్భంగా కుడుకలు (ఎండు కొబ్బరి చిప్పలు), చక్కెర బిళ్లలతో చేసిన హారాలను బహుమానంగా అందజేశారు. పూర్వ నుంచి నేటి వరకు చక్కెర బిల్లలతో చేసిన హరాలకు, కుడుకల హరాలకు ఏమాత్రం క్రేజీ తగ్గలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాల్లో హోలీ పండుగ రోజు అత్యధికంగా విక్రయిస్తారు.
హోలీ అంటేనే కుడుకల హారాలు..
తెలంగాణ సంస్కృతిలో ముఖ్యంగా హోలీ పండగ కు ఓ ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో కుల మతాలకు అతీతంగా, స్నేహితులకు సంతోషంగా రంగులు వేసుకుంటూ సంబరాలు జరుపుకునే పండగ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ రోజు రంగుల తో పాటు కుడుకల హారం చక్కెర బిళ్ళల హారాలు తమకు కావలసిన వారికి బహుమానంగా ఇస్తారు.
ఈ సంప్రదాయం వారి సంస్కృతిలో భాగం మరియు కుటుంబాల అనుబంధాన్ని సూచిస్తుంది. హోలీ పండుగ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కామదహనం, రంగులు. అయితే పల్లెల్లో మాత్రం ఈ రెండింటితోపాటు చక్కెర పేర్లకు ప్రాధాన్యత ఉంటుంది. చక్కెర ఆనకం కట్టి బిల్లలుగా తయారు చేసి వాటికి తెలుపు, గులాబీ, నారింజ రంగులను పూసి ఓ దండలగా తయారు చేస్తారు. అలాగే ఎండు కొబ్బరి ముక్కల తోపాటు ఖజూర్ లతో దండ చేసి కింద ఒక కుడుక కట్టి హారం తయారు చేస్తారు. హోలీ పండుగ సందర్భంగా తమ ఆత్మీయులకు కుడుకల పేరు హారం వేసి పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ ఇలాగే కొనసాగడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



