నవతెలంగాణ – దుబ్బాక
ఇంటి వంటకాల్లోనే అనేక పోషక విలువలు లభిస్తాయని, మార్కెట్లో లభించే జంక్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెజ్డ్ పదార్థాలతో అనర్ధాలు తలెత్తుతాయని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) దుబ్బాక ప్రాజెక్ట్ సీడీపీఓ (చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ )ఎల్లయ్య చెప్పారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాల్ని నిత్య ఆహారంలో భాగం చేసుకోవాలని, తద్వారా చిన్నారుల తో పాటు పెద్దల ఆరోగ్యానికి కావలసిన అనేక పోషక విలువలు సమకూరుతాయన్నారు. మంగళవారం దుబ్బాక మండలం గంభీర్ పూర్ లోని డ్వాక్రా భవనంలో ఏర్పాటు చేసిన “దుబ్బాక సెక్టార్ లెవెల్ పోషణ మాసం” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పౌష్టికాహార వినియోగం, అంగన్వాడీ కేంద్రాల వద్ద కిచెన్ గార్డెన్ ఏర్పాటు, మొక్కలు నాటడం, కిశోర బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించడం వంటి పలు అంశాల పట్ల అవగాహన కల్పించారు.
ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న ‘ఒకపూట సంపూర్ణ భోజనాన్ని’ గర్భిణీలు, బాలింతలు తప్పక తీసుకోవాలని సూచించారు. అనంతరం పలువురు గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చంద్రకళ, పోషణ్ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ శాంసన్, పంచాయతీ కార్యదర్శి చంద్రం, ఎంఎల్ హెచ్ పీ మహేశ్వరి, స్కూల్ హెచ్ఎం గోపాల కిషన్, మాధవి, ఏఎన్ఎం జయంతి, దుబ్బాక సెక్టర్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆశా లు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
ఇంటి వంటకాల్లోనే అనేక పోషక విలువలు: సీడీపీఓ ఎల్లయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES