- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ న్న మండలంలోని పొనకల్ చెరుకుగూడెంకు చెందిన, హోంగార్డు మంత్రి రాములు(50) బుధవారం తెల్లవారుజామున ఇంటి వద్ద మృతిచెందారు. పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న రాములు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. తన ఇంటి వద్ద మృతిచెందారు. మృతునికి భార్య పద్మతో పాటు 9ఏండ్ల కుమార్తె రశ్మిత ఉన్నారు. రాములు మృతదేహం వద్ద భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాములు విధి నిర్వహణలో అధికారుల ఆదేశాలను పాటిస్తూ, ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకున్నారు. రాములు మృతి పట్ల పోలీసులు ప్రగాఢ సంతాపం వ్యకం చేశారు.
- Advertisement -



