Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సర్పంచులకు సన్మాన సభ

నూతన సర్పంచులకు సన్మాన సభ

- Advertisement -

మండల పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు వెల్లడి..
నవతెలంగాణ- మద్నూర్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచుల ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ధరాస్ సాయిలు ఆదివారం తెలిపారు. అదే విధంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం మొదలు కానుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు నూతన సర్పంచులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -