నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజ్ఞాన జ్యోతి పాఠశాలకి చెందిన నందగిరి వర్షిత్ ను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య సన్మానించారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో పదవ తరగతి ఫలితాల్లో 589/600 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచిన వర్షిత్ ను శాలువతో సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో ఆంధ్రయ్య మాట్లాడుతూ… విద్యార్ది నందగిరి వర్షిత్ భవిష్యత్తులో కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభినందిస్తూ, ఆశీర్వదించారు. మండల టాపర్ గా నిలిచి, రాష్ట్రస్థాయి ర్యాంకు మార్కులు సాధించడం మండలానికి గర్వకారణం అన్నారు.ఈ కార్యక్రమంలో విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాల కరెస్పాండంట్ గుండోజి దేవేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. సౌమ్య, విద్యార్ది తల్లిదండ్రులు నందగిరి వెంకటేష్- లలిత, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది సురేందర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
పది మండల టాపర్ కు సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES