- Advertisement -
నవతెలంగాణ-చిన్నకోడూరు
మండల కేంద్రమైన చిన్నకోడూరులోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్, వార్డు మెంబర్ గుండు భాస్కర్ ను సంఘం తరఫున సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనమందరం ఒక కుటుంబంలా ఉండి మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగం అధ్యక్షుడు గుడిసె లక్ష్మయ్య,మహిళా అధ్యక్షురాలు పంపరి వినోద, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పంపరి కనకయ్య ,రిటైర్ టీచర్ లక్ష్మయ్య డైరక్టర్లు,గంగపుత్ర సంఘం సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


