Tuesday, October 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహక్కుల సాధన కోసం ఆశాలు ఐక్యంగా పోరాడాలి

హక్కుల సాధన కోసం ఆశాలు ఐక్యంగా పోరాడాలి

- Advertisement -

– ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– ఐఎల్‌సీ సమావేశాలు నిర్వహించాలి : ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి
– ముగిసిన తెలంగాణ ఆశావర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / మహబూబ్‌నగర్‌

హక్కుల సాధన కోసం ఆశా వర్కర్లు ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్రౌన్‌ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర 4వ మహాసభ రెండో రోజు సోమవారం జెండాను ఆమె ఆవిష్కరించారు. ముగింపు సభలో, అనంతరం విలేకరుల సమావేశంలో జయలకిë మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 45వ లేబర్‌ కమిషన్‌ సమావేశాల్లో చర్చించిన సమస్యలను పరిష్కరించకుండా.. 11 సంవత్సరాల నుంచి ఐఎల్‌సీ సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికులందరికీ రూ.26000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు కనీసం రోజుకు 175 రూపాయలు ఉంటే సరిపోతుందని ప్రధానమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆరోగ్య శాఖకు ఆరు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పారు.

సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతరం పోరాడుతూ కార్మికులకు అండగా ఉంటుందని యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అన్నారు. ఆశా వర్కర్ల యూనియన్‌ బలమైన యూనియన్‌ అని తెలిపారు. ప్రతి పోరాటంలోనూ ఆశా వర్కర్లు ఐక్యంగా కదులు తున్నారని చెప్పారు. సమరశీల పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించు కోగలమని వివరించారు. రానున్న కాలమంతా పోరాటాల కాలమని, ఆశా కార్యకర్తలు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు ప్రసంగించారు.

ఈ సభలో ఆశ వర్కర్ల యూనియన్‌ అధికార ప్రతినిధి కాసు మాధవి, సీఐటీయూ సీనియర్‌ నాయకులు కిల్లె గోపాల్‌, అధ్యక్ష కార్యదర్శులు దీప్లానాయక్‌, నల్లవెల్లి కురుమూర్తి, రైతుసంఘం రాష్ట్ర నాయకులు ఏ.రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగన్‌, కడియాల మోహన్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మయ్య, నాయకులు వి.కురుమూర్తి, కురుమూర్తి, చంద్రకాంత్‌, వేణుగోపాల్‌, రాజ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్‌, భరత్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ ప్రశాంత్‌, కెేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి మీసాల కుర్మయ్య, ఉపాధ్యక్షులు ఆదివిష్ణు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గోనెల రాములు, జిల్లా ఉపాధ్యక్షులు తిరుమలయ్య, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ప్రభాకర్‌, ఇతర ప్రజాసంఘాల నాయకులు కమర్‌ అలీ, నారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -