ఏడుగురు భారత యాత్రీకులు మృతి
గోర్ఖా : నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న భారత యాత్రికుల బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన గోర్ఖా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఆక్కడి డీఎస్పీ రాజ్‌కుమార్ శ్రేష్ఠ తెలిపిన వివరాల ప్రకారం.. గోర్ఖా జిల్లాలోని షాహిద్ లఖన్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని కాంతార్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిందన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భరత్‌పూర్‌లోని చిత్వాన్ మెడికల్ కాలేజీకి తరలించినట్టు ఆయన చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



