నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట డివిజనల్ అధికారిగా ఎంతో కాలానికి ఉద్యాన గ్రాడ్యుయేట్ ను ఆయిల్ఫెడ్ నియమించింది. డివిజనల్ అధికారిగా సభావత్ శంకర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు ఇంచార్జి డీఓ గా వ్యవహరించిన ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ నాయుడు రాధాక్రిష్ణ శంకర్ కు విధులు అప్పగించారు.
ఈయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆయిల్ ఫాం అధికారిగా వ్యవహరించనున్నారు. రాధాక్రిష్ణ తన అసలు ఉద్యోగం అయిన ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ ను కొనసాగిస్తారు. ఆయిల్ ఫెడ్ మొదటి నుండీ డివిజనల్ అధికారిగా ఉద్యాన గ్రాడ్యుయేట్ అయిన వారినే డివిజనల్ అధికారిగా నియమించే ది.అయితే ఆగస్ట్ 2020 నుండి నేటి వరకు ఇతరులే డివిజనల్ అధికారులుగా పని చేసారు. నవంబర్ 2021నుండి నవంబర్ 2022 వరకు ఒక్క ఏడాది మాత్రం ఉద్యాన గ్రాడ్యుయేట్ ఉదయ్ కుమార్ డీఓ గా విధులు నిర్వహించారు.



