Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకటకటాల్లోకి ఆస్పత్రి కాంపౌండర్‌

కటకటాల్లోకి ఆస్పత్రి కాంపౌండర్‌

- Advertisement -

రోగికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడి
కరీంనగర్‌ ప్రయివేటు ఆస్పత్రిలో దారుణ ఘటన
ఆస్పత్రి నిర్లక్ష్యమని తేలితే యాజమాన్యంపై చర్యలు : సీపీ గౌలం ఆలం


నవతెలంగాణ – కరీంనగర్‌ క్రైమ్‌
కరీంనగర్‌ నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడి చేసిన కేసులో నిందితుడైన కాంపౌండర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. క్షేత్రస్థాయి విచారణ చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలూ సేకరించారు. ఆ దారుణ ఘటనలో ఆస్పత్రి నిర్లక్ష్యం తేలితే తగిన చర్యలకు సంబంధిత శాఖకు నివేదిక పంపుతామని కరీంనగర్‌ సీపీ గౌలం ఆలం తెలిపారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన అమానుష ఘటన ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జ్వరంతో బాధపడుతున్న యువతి ని ఆమె తల్లిదండ్రులు ఈనెల 6న ఈ ఆస్పత్రిలో చేర్పించారు. అయి తే, రాత్రి విధుల్లో ఉన్న కాం పౌండర్‌/ ఓటీ టెక్నీషియన్‌ పెద్ది దక్షన్‌ మూర్తి అలియాస్‌ దక్షిణామూర్తి(23) యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. మత్తు నుంచి కోలుకున్న బాధితురాలు తన తండ్రికి విషయం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రిలో సాక్షులను విచారిం చడంతోపాటు, సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఈనెల 8న నిందితుడు దక్షన్‌మూర్తిని అరెస్టు చేశారు. ఇంటర్మీడియట్‌ (బైపీసీ) చదివిన నిందితుడు, నాలుగేండ్ల కిందట కరీం నగర్‌ వచ్చి వేర్వేరు ఆస్పత్రుల్లో పనిచేశాడు. తరచూ మద్యం సేవించి డ్యూటీ కి రావడం వల్ల గతంలో పని చేసిన చోట అతడిని తొలగించినట్టు పోలీసులు తెలి పారు. ఈ దారుణానికి పాల్పడటానికి అతడి చెడు అలవాట్లు కారణంగా గుర్తిం చారు. ఈ కేసులో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే సంబంధిత అధికారులకు నివేదిక పంపిచర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad