Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రోహిబిట్ జాబితా నుంచి ఇళ్లు, భూములు తొలగించాలి

ప్రోహిబిట్ జాబితా నుంచి ఇళ్లు, భూములు తొలగించాలి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

ప్రొహిబిట్ జాబితాలో చేర్చిన ఇళ్లు, భూములను వెంటనే తొలగించి బాధితులకు న్యాయం చేయాలని ఆలేరు మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి  సునీత  మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని బాధితులకు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 22A Act 1908 మరియు POT Act 1977 ప్రకారం అనేక ఇళ్లు, భూములను ప్రొహిబిట్ జాబితాలో చేర్చడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నో సంవసరాలుగా తమ స్వంతంగా ఉపయోగిస్తున్న భూములు, ఇళ్లు అకస్మాత్తుగా ప్రొహిబిట్ జాబితాలో చేరడంతో వాటిని అమ్ముకోవడం, కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వంటి పనులు నిలిచిపోయాయని తెలిపారు. దీని వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని,కొందరు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడానికీ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి అర్హులైన వారి ఇళ్లు, భూములను వెంటనే ప్రొహిబిట్ జాబితా నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని, అధికార యంత్రాంగం బాధితుల సమస్యలను పరిగణించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుందని,బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.22A చట్టం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం ధర్నా కార్యక్రమం ముగిసిన తర్వాత బాధితుల సమస్యలను వివరించిన వినతి పత్రాన్ని తహసిల్దార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -