- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో 500 మీటర్ల దూరంలో ఉన్న భూములు,ఇండ్లను సేకరించాలని భూనిర్వాసితులు తాండ్ర మల్లేష్, కేసారపు నరేష్ సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు నిత్యం ఓసిపి బ్లాస్టింగ్ దెబ్బలతో ఇండ్లలోకి దుమ్ము,దూళి చేరడంతో ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జెన్కో అధికారులు వెంటనే పరిహారం,ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలన్నారు.ఈ నెల 31 వరకు పరిహారం ఇవ్వకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -