Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ఇలా.. ప్రయాణించేది ఎలా..?

రోడ్డు ఇలా.. ప్రయాణించేది ఎలా..?

- Advertisement -

వర్షం కొడితే బురద, ఎండకొడితే దుమ్ము…
నవతెలంగాణ -కాటారం

కాటారం నుండి గంగారం ఎక్స్ రోడ్డు వరకు రూ.30 కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అధికారుల పట్టింపు కొరవడడంతో గుత్తేదారులు పనులను సాగదీస్తున్నారు. కాటారం నుండి గంగారం ఎక్స్ రోడ్డు వరకు గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు దుమ్ము లేస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

స్వయాన మంత్రి ఇలాఖాలో..
స్వయానా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజక వర్గం.. అంతేకాకుండా మంత్రి సొంత మండలమైన కాటారంలో అభివృద్ధి పనులు కక్రుత్తి కాంట్రాక్టర్ల చేతిలో తూతూ మంత్రంగా సాగుతున్నాయి. అంతేకాకుండా అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు వాపోతున్నారు.

ప్రయాణికుల అవస్థలు..
కాటారం నుండి గంగారం ఎక్స్ రోడ్డు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయినా అధికారుల్లో గానీ, కాంట్రాక్టర్లలో గానీ ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఈ రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ రోడ్డుపై ప్రమాదాలు జరిగిన దాఖలాలు లేకపోలేదని అంటున్నారు. 

పనులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.
సంబంధిత అధికారుల నిర్వాకంతో రోడ్డు పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో గుత్తేదారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా రోడ్డుపై లేస్తున్న దుమ్మును అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -