Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంజస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు ఎలా అందింది

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు ఎలా అందింది

- Advertisement -

రిటైర్డు ఐఏఎస్‌ జోషిని వివరాలు అడిగిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు మీకు ఎలా అందిందో చెప్పాలని ఇరిగేషన్‌ శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి శైలేంద్ర కుమార్‌ జోషిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై 10న జరిగే విచారణలో చెప్పాలంది. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు అమలును నిలిపివేయా లంటూ జోషి దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. కమిషన్‌ కాపీ ఎలా అందిందని హైకోర్టు ప్రశ్నకు పిటిషనర్‌ లాయర్‌ స్పందిస్తూ, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిందనీ, ఆన్‌లైన్‌లో రిపోర్టు ఉందని చెప్పారు. అసెంబ్లీలో పెడితే ఎమ్మెల్యేలకే రిపోర్టు అందు తుందనీ, ఆన్‌లైన్‌లో రిపోర్టు తీసేయాలని గతంలోనే ఆదేశించామని చెప్పింది. ఈ వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేస్తామని న్యాయవాది అన్నారు. అప్పటివరకు కమిషన్‌ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే కేసీఆర్‌, హరీశ్‌లకు వెసులుబాటు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందనీ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉందని లేకపోతే పిటిషనర్‌ ప్రతిష్టకు నష్టం జరుగుతుందని చెప్పారు. కమిషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 8(బి), 8(సి) కింద నోటీసు ఇవ్వలేదనీ, సాక్షిగా పిలిచిన కమిషన్‌ ఏకపక్షంగా ఆరోపణలు చేస్తూ రిపోర్టు ఇచ్చిందన్నారు. విధుల నిర్వహణ సరిగా చేయలేదని కమిషన్‌ తేల్చడం ఏకపక్షమన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందిస్తూ, గతంలో ఆన్‌లైన్‌లో ప్రభుత్వం రూపొందించిన కమిషన్‌ ఇచ్చిన రిపోర్టును బ్రీఫ్‌ చేయించింది ఉంచారనీ, హైకోర్టు ఆర్డర్‌ తర్వాత తొలగించామని చెప్పారు. విచారణ ఈనెల 10కి వాయిదా పడింది.
మిడ్డే మీల్స్‌ మెనూ అమలు వివరాలివ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రభుత్వ, గురుకుల, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే ఆహార నాణ్యతాప్రమాణాల అమలు గురించి వివరించాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆహార మెనూ వివరాలు, వాటి అమలు తీరుపై కౌంటర్‌ వేయా లంది. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులకు ఆహారం ఉండటం లేదనీ, సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బందులకు గురౌతున్నా రంటూ అఖిల్‌ శ్రీగురుతేజ పిల్‌ వేశారు. చీఫ్‌ జస్టిస్‌ పీకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ ఈ పిల్‌ను విచారించింది. ఒక పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా వందకుపైగా బాలికలు ఆస్పత్రిపాల య్యారని చెప్పారు. పాఠశాల స్థాయిలో ఉన్న కమిటీల పర్యవేక్షణలో తనిఖీలు, ఆహార పరిశీలన చేశాక ఫొటోలు తీసి అధికార వెబ్‌లో పోస్టు చేయాలనే నిబందన లను కాగితాలకే పరిమితం అయ్యాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్లీడర్‌ స్పందిస్తూ, ఎక్కువ కారం వేయడం వల్ల వందకుపైగా బాలికలు అస్వస్థతకు గురయ్యారనీ, వంట మనిషిని తొలగించామని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రతినిధితో టాస్క్‌ఫోర్సు కమిటీలు ఉన్నాయన్నారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయు లు కూడా రోజూ భోజనం చేస్తే క్షేత్ర స్థాయిలోనే సమస్యలను గుర్తించేందుకు వీలుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులకు కూడా వంట పనిలో భాగస్వామ్యం కల్పిస్తే కూడా వారిని పని అలవడం జరుగు తుందనేది తమ వ్యక్తిగత అభిప్రాయమని చెప్పింది. విచారణను 19వ తేదికి వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad