Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి భారీ విరాళం

ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి భారీ విరాళం

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన మండల పరిధిలోని ఉమామహేశ్వర దేవస్థానానికి హైదరాబాద్ వాస్తవ్యులు అరవపల్లి లక్ష్మీ నరసింహం కుటుంబ సభ్యులు శనివారం విరాళం లక్ష పన్నెండు వేల రూపాయలను విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవ రెడ్డికి అందజేశారు. ఆలయం తరఫున గణపతి పూజ కుంకుమార్చన, అభిషేకము, పూజా కార్యక్రమం నిర్వహించి, అర్చకులు వేద ఆశీర్వాదం అందజేశారు. అనంతరం వారికి స్వామి వారి శేష వస్త్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -