Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంజమ్మూకాశ్మీర్‌లో భారీగా ఐఇడి స్వాధీనం

జమ్మూకాశ్మీర్‌లో భారీగా ఐఇడి స్వాధీనం

- Advertisement -

ఇద్దరు వైద్యులతో సహా ఏడుగురు అరెస్టు
శ్రీనగర్‌ :
జమ్మూకాశ్మీర్‌ పోలీసులు ఆది, సోమవారాల్లో వివిధ ప్రదేశాల్లో జరిపిన సోదాల్లో 2,900 కేజీల ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌ (ఐఇడి) తయారు చేసే మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వైద్యులుసహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారికి ఉగ్రవాద సంస్థలు జైష్‌-ఎ-మొహమ్మద్‌ (జెఎం), అన్సార్‌ ఘజ్వత్‌- ఉల్‌- హింద్‌ (ఎజియుహెచ్‌)తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. శ్రీనగర్‌, అనంతనాగ్‌, గండర్‌బాల్‌, షోపియన్‌ల్లో జమ్మూకాశ్మీర్‌ పోలీసులు సోదాలు జరపగా, హర్యానా పోలీసులతో కలిసి ఫరీదాబాద్‌, ఉత్తరప్రదేశ్‌ పోలీసులతో కలిసి సహరాన్‌పూర్‌లో సోదాలు జరిపారు. అరెస్టు చేసిన వైద్యులను పుల్వామాలోని కోయిల్‌కు చెందిన డాక్టర్‌ ముజమ్మిల్‌ అహ్మద్‌ గనై అలియాస్‌ ముసాయిబ్‌, కుల్గాంలోని వాన్‌పోరాకు చెందిన డాక్టర్‌ అదీల్‌గా గుర్తించారు.
దౌజ్‌లోని అల్‌ ఫలా విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ మెంబర్‌గా పనిచేస్తున్న ముజమ్మిల్‌ అహ్మద్‌ను ఫరీదాబాద్‌లో అరెస్టు చేశారు. ఇక్కడ అతని అద్దె నివాసంలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు, దర్యాప్తు కొనసాగుతున్నాయని యుఎపిఎలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని జమ్మూకాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. అక్టోబర్‌ 19న నౌగామ్‌లో వివిధ ప్రాంతాల్లో పోలీసులను, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు అతికించిన నేపథ్యంలో ఈ సోదాలను పోలీసులు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -