Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమనువాదం వికలాంగుల హక్కులకు వ్యతిరేకం

మనువాదం వికలాంగుల హక్కులకు వ్యతిరేకం

- Advertisement -

పింఛన్‌ వాటా పెంపులో కేంద్రం నిర్లక్ష్యం
దేశవ్యాప్త ఉద్యమానికి ఎన్‌పీఆర్‌డీ శ్రీకారం : సంఘం జాతీయ అధ్యక్షులు గిరీష్‌ కీర్తి
సామాజిక అసమానతలను పెంచిపోషిస్తున్న కేంద్రం : జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మనువాదం వికలాంగుల హక్కులకు వ్యతిరేకమనీ, కేంద్ర ప్రభుత్వం సామాజిక అసమానతలను పెంచి పోషిస్తున్నదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరీష్‌ కీర్తి, మురళీధరన్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎన్‌పీఆర్‌డీ జాతీయ కమిటీ సమావేశాన్ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నంబురాజన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా గిరీష్‌ కీర్తి మాట్లాడుతూ ట్రంప్‌ పెంచుతున్న సుంకాలు సామాజిక భద్రత, విద్యా, వికలాంగుల హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల వల్ల నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని చెప్పారు. అనేక వస్తువులపై జీఎస్‌టీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం గతంలో వికలాంగులకు ఇచ్చిన జీఎస్‌టీ రాయితీ లను ఎందుకు ఉపసంహరించుకుందని ప్రశ్నించారు. దేశాన్ని హిందూ మత విలువలతో నింపాలని కేంద్రం ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజల మధ్య మతపరమైన ఉద్రిక్తలను సృష్టస్తున్నదని తెలిపారు. వికలాంగుల క్రీడల కోసం దేశవ్యాప్తంగా పారా స్పోర్ట్స్‌ పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

అంతర్జాతీయ పార్పుల్‌ ఫెస్ట్‌ ప్రచారం కోసమే తప్ప వికలాంగుల కోసం కాదని తెలిపారు. దేశంలో 150 మిలియన్ల ప్రజలు ఏదొక రకమైన మాన సిక ఆరోగ్య రుగ్మతలతో బాధ పడుతు న్నారని చెప్పారు. మానసిక వికలాంగుల సంరక్షణను కేంద్ర ప్రభుత్వం గాలికి ఒదిలివేస్తున్నదని విమర్శించారు. 2017 మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును మానసిక వికలాంగులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు ఇస్తున్న పింఛన్లలో వాటాను రూ.ఐదువేలకు పెంచే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చ రించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. వికలాంగుల చట్టాలు అమలు చేయకుండా వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.

మురళీధరన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లకు నిధుల కోత విదిస్తున్నారని ఆరో పించారు. ప్రభుత్వ రంగంలో వికలాం గుల ఉద్యోగ అవకాశాలను తిరస్కరిస్తు న్నదని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో వికలాంగులను పరిగనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్ట్‌ చెప్పినా మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానం వికలాంగులకు అనుకూలంగా లేదని చెప్పారు. ప్రజారవాణా వికలాంగులకు అందుబాటులో లేదని తెలిపారు. వికలాంగులు గౌరవంగా జీవించేందుకు ఇండ్లు, ఇండ్లస్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆటీజం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యం కలిగిన పిల్లలకు సమగ్ర విద్య అందించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

విద్యాహక్కు చట్టం, 2016 ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మిళిత విద్యను పొందే హక్కు ఉందని గుర్తు చేశారు. కేరళ ప్రభుత్వం ప్రకటించిన విజన్‌ కేరళ 2031 వికలాంగుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నదని తెలిపారు. వికలాంగుల అభివృద్ధి, జీవన నాణ్యతను పెంచేందుకు కేరళ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రజా ప్రదేశాలు, రవాణా, గృహనిర్మాణం, డిజిటల్‌ ప్లాట్‌ఫారాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు 100 శాతం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం చేసిందని గుర్తు చేశారు. వికలాంగుల కోసం ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను మూసేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు ఎం అడివయ్య, జాన్సీ, సహాయ కార్యదర్శి రిషికేష్‌, కోశాధికారి చక్రవర్తి, కేంద్ర కమిటీ సభ్యులు కె వెంకట్‌, ఆర్‌ వెంకటేశ్‌, జె రాజు, రంగప్ప, రాజన్‌, విల్సన్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -