- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తాజా గ్రూప్-2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వినీత, హేమచంద్ర అనే భార్యాభర్తలు సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు సాధించారు. గతంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరు, నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. వీరిద్దరూ ఉద్యోగాలు సాధించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. మొత్తం 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.
- Advertisement -



