నవతెలంగాణ హైదరాబాద్: HYBE ఇండియా ఈరోజు తన ఆడిషన్ల తదుపరి దశను ప్రకటించింది. ఇందులో ప్రత్యక్ష (ఇన్ పర్సన్) ఆడిషన్ టూర్ వివరాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న ప్రతిభను ఆకర్షించేందుకు ప్రోత్సహించేందుకు రూపొందించిన పాప్-అప్ కార్యక్రమాల శ్రేణి కూడా ఉన్నాయి. ఆడిషన్ టూర్ 2026 మే నుంచి జూలై వరకు జరుగుతుంది. ఇది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 15 నగరాలను కవర్ చేస్తుంది. ఈ టూర్ మే 3న గువాహటి నుంచి ప్రారంభమై, ముంబై (మే 10), పుణే (మే 17), హైదరాబాద్ (మే 24), బెంగళూరు (మే 31) వంటి ముఖ్య నగరాలకు కొనసాగుతుంది. అదనంగా, టొరొంటో (మే 23-24), న్యూయార్క్ (మే 30), సింగపూర్ (జూన్ 13), సిడ్నీ (జూన్ 20), లండన్ (జూలై 4-5) వంటి అంతర్జాతీయ నగరాలకు విస్తరించబడుతుంది. తర్వాత ఇది భారతదేశంలోని ఇతర నగరాలకు కొనసాగుతూ, ఢిల్లీ (జూన్ 14), చెన్నై (జూన్ 27), అహ్మదాబాద్ (జూలై 11), కోల్‌కతా (జూలై 18), చండీగఢ్ (జూలై 25) నగరాల్లో కూడా నిర్వహించబడుతుంది.
ప్రత్యక్ష (ఇన్ పర్సన్) ఆడిషన్లను హైబ్ వారి గ్లోబల్ టాలెంట్ డెవలప్‌మెంట్ నిపుణులతో కూడిన ప్రతిష్ఠాత్మక ప్యానెల్ మూల్యాంకనం చేస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ సంగీత కళాకారులను ఎంపిక చేసి అభివృద్ధి చేసిన అనుభవం కలిగిన ఈ నిపుణులతో పాటు, స్థానిక ప్రతిభ, సంస్కృతిపై లోతైన అవగాహన కలిగిన భారతీయ వినోద రంగ నిపుణులు కూడా ఈ ప్యానెల్‌లో ఉంటారు. ఈ ప్యానెల్ కలిసి, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిజమైన ప్రతినిధులుగా నిలబెట్టగల కళాకారులను గుర్తించేందుకు సిద్ధంగా ఉంది. అభ్యర్థులను కేవలం పైపై మెరుపుల ఆధారంగా కాకుండా, సహజ ప్రతిభ, నిజమైన కళాత్మకత, దీర్ఘకాలిక సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అంచనా వేస్తారు.
పాల్గొనదలిచిన వారు ఆడిషన్లు పాప్-అప్ పార్క్‌ల కోసం బుక్ మై షో ద్వారా ముందుగా స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి నగరానికి సంబంధించిన వివరమైన షెడ్యూల్‌లు పాల్గొనే మార్గదర్శకాలు హైబ్ ఇండియా అధికారిక ఆడిషన్ వెబ్ సైట్ సోషల్ మీడియా ఛానళ్లలో వరుసగా ప్రకటించబడతాయి. అదేవిధంగా, ప్రత్యక్ష (ఇన్ పర్సన్) ఆడిషన్ కేంద్రాల్లో ‘ఫస్ట్-కమ్, ఫస్ట్-సర్వ్’ పద్ధతిలో వాక్-ఇన్ నమోదు అవకాశమూ అందుబాటులో ఉంటుంది. హైబ్ ఇండియా ఆడిషన్ ప్రధాన ఉద్దేశ్యం.. భారతదేశంలోని టీన్స్ యువతకు తమ ఆశయాలను నెరవేర్చుకునేలా అర్థవంతమైన, ప్రపంచ స్థాయి వేదిక అందాలి అనే విశ్వాసం. ఆ భావాన్ని సాకారం చేయడానికి పాప్-అప్ పార్క్‌లు రూపుదిద్దుకున్నాయి.
ఆడిషన్ తేదీలకు ముందుగా గువాహటి, ముంబై, పుణే, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ—ఈ ఆరు నగరాల్లో నిర్వహించబడే ఈ కార్యక్రమాలు ఓపెన్, ఇంటరాక్టివ్ స్థలాలుగా ఉంటాయి. ఆడిషన్లలో పాల్గొంటున్నా, పాల్గొనకపోయినా యువత సంగీతం, ప్రదర్శనలు, సృజనాత్మక వ్యక్తీకరణతో అనుసంధానమయ్యేలా ఇవి ఆహ్వానిస్తాయి. ప్రతి పాప్-అప్ పార్క్‌లో బ్రాండ్ భాగస్వాముల అనుభవాత్మక బూత్‌లు, ఇంటరాక్టివ్ యాక్టివేషన్లు, కొన్ని నగరాల్లో సర్‌ప్రైజ్ స్టేజ్ ప్రదర్శనలు ఉంటాయి—దీంతో ఆడిషన్ ప్రయాణాన్ని అందరికీ అందుబాటులో ఉండే, ఆహ్లాదకరమైన అనుభవంగా విస్తరించబడుతుంది.
పోటీదారులను ప్రోత్సహించేందుకు, ఈ ఆడిషన్‌లో పలు వ్యూహాత్మక బ్రాండ్ భాగస్వామ్యాలు ఉన్నాయి. సాంసంగ్ తన “షో దెమ్ హౌ ఇట్స్ డన్ #విత్ గ్యాలక్సీ” ప్రచారం ద్వారా యువ ప్రతిభావంతులను ప్రేరేపిస్తూ, వారు గ్లోబల్ వేదికపై నేర్చుకోవడం, సృష్టించడం, ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం కోసం సహాయపడుతోంది. హెచ్ అండ్ ఎం తన ప్రచారం ద్వారా ఫ్యాషన్ సంగీతాన్ని స్వీయ వ్యక్తీకరణ వేదికలుగా ముందుకు తెచ్చి, అభివృద్ధి చెందుతున్న ప్రతిభను ఆడిషన్‌కు సిద్ధం చేస్తోంది. నోంగ్షిమ్ షిన్ రామ్యున్ “స్పైసీ హ్యాపీనెస్ ఇన్ నూడుల్స్” ద్వారా భారతదేశంలోని యువతుల కలలు ఆసక్తులను ప్రోత్సహిస్తోంది. షాపర్స్ స్టాప్, హైబ్ ఇండియాతో కలిసి ‘గెట్ స్పాట్ లైట్ రెడీ’ కార్యక్రమాన్ని ప్రారంభించి, భారతదేశపు తొలి గ్లోబల్ గర్ల్ గ్రూప్ కలలను మద్దతు ఇస్తోంది. అదనంగా, స్నాప్ చాట్ బుక్ మై షో వరుసగా మీడియా టికెటింగ్ భాగస్వాములుగా చేరుతున్నాయి.
హైబ్ ఇండియాఆడిషన్ 2005 నుండి 2011 మధ్య జన్మించిన మహిళా పాల్గొనేవారికి, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ వలస సముదాయానికి అందుబాటులో ఉంది. వారు వివిధ ప్రదర్శన విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆహ్వానించబడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని వైవిధ్యమైన స్వరాలను ప్రతినిధ్యం వహిస్తూ, ప్రపంచ ప్రేక్షకులతో అనుసంధానమయ్యే కొత్త గర్ల్ గ్రూప్‌ను గుర్తించి అభివృద్ధి చేయాలన్న హైబ్ ఇండియాదృష్టిని ప్రతిబింబిస్తోంది. అర్హత పాల్గొనే మార్గదర్శకాలతో సహా మరిన్ని వివరాలు హైబ్ ఇండియా అధికారిక ఆడిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానళ్లలో అందుబాటులో ఉన్నాయి.



