- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో సమావేశమై బతుకమ్మకుంట పునరుద్ధరణలో హైడ్రా చొరవకు అభినందనలు తెలిపారు. భూములను ఆక్రమణల నుండి రక్షించేందుకు హైడ్రా సహాయం అవసరమని చెప్పారు. కమిషనర్ రంగనాథ్, సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని, డీజీపీఎస్ సర్వే ద్వారా భూసాంకేతిక అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. వరంగల్ నాలాల ఆక్రమణలనూ మంత్రి చర్చించారు.
- Advertisement -



