నవతెలంగాణ-మణికొండ
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ముష్కిన్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. మై హోమ్ అవతార్, హాల్ మార్క్ విసినియా నివాసితుల విజ్ఞప్తి మేరకు స్థానిక మున్సిపాలిటీ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యను క్షుణ్ణంగా పరిశీలించారు. ముష్కిన్ చెరువులోకి వస్తున్న మురుగునీరు, ఎఫ్‌టీఎల్ మట్టి నింపిన విషయం, ధ్రువంశుసంస్ధ చేపడుతున్న చర్యలను స్థానికులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి, నాలా సర్వే, చెరువు ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తామన్నారు. మురుగునీటిని డైవర్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిశీలించిన వారిలో.. స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ విభాగం డీఈలు శివసాయి, సంజరు, స్థానికులు ఉన్నారు.
ముష్కిన్ చెరువును పరిశీలించిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES