సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. మానస వారణాసి హీరోయిన్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా ఇది తెరకెక్కుతోంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘నాలో నేను’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ కొత్త స్టైల్ ట్యూన్‌తో కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, సంజిత్ హెగ్డే పాడారు. ‘నాలో నేను, తనలో తాను, కలిసే ఉన్నాం విడిగా..’ అంటూ మెలోడియస్‌గా సాగే ఈ పాట అందర్నీ అలరిస్తోంది అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి ఎడిటర్ – గణేష్ శివ, డీవోపీ – దినేష్ పురుషోత్తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్‌ఎస్ వర్మ.
‘నాలో నేను..తనలో తాను’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES