Tuesday, September 30, 2025
E-PAPER
Homeసినిమాచిరు.. ఉన్నారనే భరోసా కలిగింది

చిరు.. ఉన్నారనే భరోసా కలిగింది

- Advertisement -

సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, ఫెడరేషన్‌ నాయకులకు మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవుతూ వచ్చాయి. దీంతో గత 14 రోజులుగా సినిమాల చిత్రీకరణలు నిలిచి పోయాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగారు.
ఫెడరేషన్‌ సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రతి యూనియన్‌తో విడివిడిగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్‌తో ఫిలిం ఛాంబర్‌ సమావేశం కానుంది.
సమావేశం అనంతరం ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ,’కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ గత 15 రోజులుగా మేం సమ్మె చేస్తున్నాం. ఈరోజు అగ్రకథానాయకుడు చిరంజీవి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారు. 24 విభాగాల నుంచి 72 మందితో చర్చించారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీద నిందలు వేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చాం. సాధ్యం కాని, అమలు చేయలేని నిబంధనలు పెడుతున్నారని తెలిపాం. ఏదేమైనా మా కార్మికులతో పాటు, నిర్మాతలూ బాగుండాలని, నిర్మాతలు చెప్పిన ఆ రెండు షరతులను అంగీకరిస్తే తామే నష్టపోతామని చిరంజీవికి వివరించాం. అలాగే ఆదివారం డబుల్‌ కాల్‌షీట్‌ గురించి కూడా విన్నవించాం. ‘మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి’ అని చిరంజీవి భరోసా ఇచ్చారు. అందరి సమస్యలు సానుకూలంగా విన్నారు. మంగళవారం జనరల్‌ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేస్తాం. ఛాంబర్‌ నుంచి కూడా మాకు పిలుపు వచిచంది. చర్చలకు పిలిచారు కాబట్టి, మేం నిరసన కార్యక్రమం ప్రస్తుతానికి ఆపేశాం. మేం అడిగినట్లు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -