Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగుర్తులొచ్చేశాయ్!

గుర్తులొచ్చేశాయ్!

- Advertisement -

సర్పంచ్‌, వార్డు మెంబర్ల చిహ్నాలు ఫైనల్‌…గ్రామీణులకు అర్థమయ్యేలా సింబల్స్‌
బ్యాలెట్‌ పేపర్లపై అభ్యర్థి పేరు, చిహ్నం…సర్పంచ్‌లకు 30, వార్డుమెంబర్లకు 20 గుర్తులు

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పంచాయతీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎన్నికల రిజర్వేషన్లపై పలువురు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక ఎలాంటి సంకోచం లేకుండా ఆశావహులు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు ఈవీఎంలను కాకుండా బ్యాలెట్‌ పత్రాలను వినియోగిస్తారు. అలాగే పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి రాజకీయ పక్షాల సింబల్స్‌ బ్యాలెట్‌ పేపర్లపై ఉండే అవకాశం లేదు. ఈ ఎలక్షన్‌ల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక గుర్తులను ఎంపిక చేసింది. సర్పంచ్‌, వార్డుమెంబ ర్లకు వేర్వేరుగా గుర్తులను కేటాయించింది.

సర్పంచ్‌లకు 30..వార్డుమెంబర్లకు 20 గుర్తులు
రాష్ట్రవ్యాప్తంగా 12,728 గ్రామపంచా యతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం మొత్తం 50 గుర్తులను ఎన్నికల కమిషన్‌ ఎంపిక చేసింది. సర్పంచ్‌ అభ్యర్థుల కోసం 30 గుర్తులు కేటాయించగా.. వార్డుమెంబర్ల కోసం 20 గుర్తులను కేటాయించారు. అదనంగా అభ్యర్థులు బరిలో నిలిస్తే ఆ సంఖ్యను బట్టి మరికొన్ని గుర్తులను కూడా కేటాయించేందుకు వీలుగా ఎంపిక చేశారు. ఎవరికి ఏ గుర్తనేది నామినేషన్ల ఘట్టం ముగిశాక, ఫైనల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులకు డ్రా తీసి ఎన్నికల సంఘం అధికారులు గుర్తులను కేటాయిస్తారు. అందరికీ స్పష్టంగా కనిపించేలా అభ్యర్థి పేరు, గుర్తు బ్యాలెట్‌ పత్రాలపై ముద్రిస్తారు. సర్పంచ్‌లకు గులాబీ, వార్డుమెంబర్లకు వైట్‌ బ్యాలెట్‌పై ఈ గుర్తులు ఉంటాయి. ఎవరికి ఏ పార్టీ సపోర్టు చేసినా గుర్తులు మాత్రమే ఇవే ఉంటాయి. ఇప్పటికే ఆయా గుర్తులను ఎంపిక చేసుకొని ఫ్లెక్సీ షాప్స్‌ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు.

సర్పంచ్‌ అభ్యర్థుల సింబల్స్‌ ఇవే..
సర్పంచ్‌ అభ్యర్థుల కోసం 30 గుర్తులను ఎంపిక చేశారు. వీటిలో ఉంగరం, కత్తెర, బ్యాట్‌, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్ట్‌, స్పానర్‌, కప్పుసాసర్‌, విమానం, బంతి, షటిల్‌, కుర్చీ, వంకాయ, బ్లాక్‌బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బక్కెట్‌, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్‌, టార్చిలైట్‌, బ్రష్‌, క్యారెట్‌, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్‌, వేణువు (ప్లూట్‌), ఫోర్కు, చెంచా గుర్తులు కేటాయించారు. వీటితో పాటు నోటా గుర్తు ఉంటుంది. ఇందులో ఏ గుర్తులు ఎవరికి వస్తాయో.. నామినేషన్ల ఘట్టం ముగిశాక ఫైనల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులకు డ్రా ద్వారా వీటిని కేటాయిస్తారు.

వార్డుమెంబర్ల కోసం..
ఇక వార్డుమెంబర్ల కోసం 20 గుర్తులను ఎన్నికల కమిషన్‌ ఎంపిక చేసింది. వీటిలో జగ్గు, గౌను, గ్యాస్‌పొయ్యి, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బాల్‌, బీరువా, కీసుపిట్ట (విజిల్‌), కుండ, డిష్‌ యాంటీన, గౌర, మూకుడు, కేతిరి (కేటిల్‌), విల్లు-బాణం, ఎనవలప్‌ కవర్‌, హాకీ కర్ర బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పోస్టుడబ్బా, విద్యుత్‌ స్తంభం గుర్తులను కేటాయించారు. నోటా గుర్తు కామన్‌గా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -