Saturday, July 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటా..

ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటా..

- Advertisement -

శతాధిక చిత్ర నిర్మాత – భీమవరం టాకీస్ అధినేత టి. రామసత్యనారాయణ సారధ్యంలో ఈ ఏడాది కూడా కోడి రామకృష్ణ స్మారక పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ప్రసాద్ లాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, నటుడు మురళి మోహన్, దర్శకులు రేలంగి నరసింహారావు, హీరో సుమన్, నిర్మాతలు కేఎస్ రామారావు, ప్రసన్న కుమార్, అశోక్ కుమార్, దామోదర్ ప్రసాద్, బాబూమోహన్, దివ్యవాణి, అంబికా కృష్ణ, వంశీ రామరాజు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, ‘మా రామసత్య నారాయణ ఇప్పటికే ఒకటిన్నర సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఎఐ టెక్నాలజీ అంది పుచ్చు కున్నాడు. కాబట్టి సునాయాసంగా మూడు సెంచరీలు చేసి 300 సినిమాలు తీసిన నిర్మాతగా చరిత్ర సృష్టిస్తాడుఅని అన్నారు. 'నా చివరి శ్వాస వరకు దాసరి, కోడి రామకృష్ణలను మర్చిపోను, ఎవరినీ మర్చిపోనివ్వను. వారిద్దరి చలవ, ఆశీర్వాదం, ప్రోత్సాహంతోనే నేను చిత్ర పరిశ్రమలో ఈ స్థాయికి చేరుకున్నాను అని రామసత్య నారాయణ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -