Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామానికి తన వంతు సహకారం అందజేస్తా..

గ్రామానికి తన వంతు సహకారం అందజేస్తా..

- Advertisement -

ఆదరించిన వార్డు ఓటర్లకు అభినందనలు 
రాముని పట్ల ఉపసర్పంచ్ శంకర్ 
నవతెలంగాణ – చిన్నకోడూరు 

తనపై గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు పెట్టిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తూ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని గ్రామానికి తనవంతు సహకారం అందజేస్తానని రామునిపట్ల ఉప సర్పంచ్ బైతి శంకర్ అన్నారు. శనివారం ఆయన  గ్రామంలోని వార్డు  ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను ప్రోత్సహించాలని వార్డు సభ్యులు తనను ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగిందని వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తూ సర్పంచ్ కు అండగా ఉంటూ  గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా గ్రామానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రజలు చూపిన ఆధారాలు తాను కృతజ్ఞులుగా పనిచేసి ప్రజల మన్ననలను పొందుతానని పేర్కొన్నారు తాను ఉప సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా తాను దగ్గరుండి తీరుస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -