Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనా బిడ్డను ఎమ్మెల్యేగా చేసి తీరుతా..

నా బిడ్డను ఎమ్మెల్యేగా చేసి తీరుతా..

- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు
నవతెలంగాణ -గీసుగొండ

‘నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు.. అయితే నాకు పునర్జన్మనిచ్చింది గీసుకొండ మండలం. నా రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. నా భార్య కొండా సురేఖను ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా తీర్చిదిద్దిన ఘనత గీసుకొండ ప్రజలదే. ఇకపై నా కుమార్తె కొండా సుష్మిత పటేల్‌నూ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించి తీరుతాను’ అని మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు తెలిపారు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర వేడుకలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అట్టహాసంగా జరిగాయి. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అనుచరులు భారీ ప్రభ బండిని ఏర్పాటు చేశారు. అల్లం బాలకిషోర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభ బండిని నిర్మించగా, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభ బండి నిర్వహణను అద్భుతంగా చేపట్టిన అల్లం బాలకిషోర్‌ రెడ్డిని. నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అలాగే, కొండా సుష్మిత పటేల్‌ మాట్లాడుతూ.. గీసుకొండ నుంచే తమ కుటుంబ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, తన రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడినుంచే మొదలవుతుందని తెలిపారు. ఇక్కడికి రావడం సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగిస్తుందని చెప్పారు. గీసుకొండ ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరించినట్టే తనను కూడా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పరకాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. వారంలో రెండు రోజులు వంచనగిరిలో అందుబాటులో ఉంటానని తెలిపారు. కాగా, ఆధ్యాత్మిక భక్తి, రాజకీయ ఉత్సాహం కలగలిసి కొమ్మాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -