Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాను 

ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాను 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పెరుమాండ్ల రాజు గౌడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పెరుమాండ్ల రాజు గౌడ్, ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య అన్నారు. గురువారం పార్టీ కార్యకర్త గాదరి నాగేష్ జన్మదిన వేడుకను పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న కార్యకర్తలు అదరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఆపద వచ్చిన వెంటనే అక్కడ ఉండి వారి సమస్యను పరిష్కరించే దాకా కృషి చేస్తానని అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ వారు అభివృద్ధి కోసం నిరంతరం కృష చేస్తానని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో గ్రామాన్ని కాకుండా మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -