లండన్ (ఇంగ్లాండ్) : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మరోసారి ఇంగ్లాండ్‌లోనే జరుగనుంది. 2025 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు లార్డ్స్ ఆతిథ్యం ఇవ్వగా.. దక్షిణాఫ్రికా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2025 ఫైనల్ లార్డ్స్‌లో విజయవంతం కావటంతో మరో మూడు పర్యాయాలు అక్కడే డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తొలి టెస్టుకు లార్డ్స్ పిచ్ ‘అసంతృప్తికరం’ రేటింగ్ అందుకుంది. పిచ్ లోపాలను అంగీకరించిన లార్డ్స్ మేనేజ్‌మెంట్ ఎంసీసీ.. పిచ్ పనులను ఆధునీకరించే ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో 2027 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదికను లార్డ్స్ నుంచి ది ఓవల్‌కు మార్చారు. ది ఓవల్‌లో 2027 జూన్ జూన్9-13న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది. ఈ మేరకు ఐసీసీ, ఈసీబీ (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) నిర్ణయం తీసుకున్నాయి.
డబ్యూటీసీ ఫైనల్ ది ఓవల్‌లో..ఖరారు చేసిన ఐసీసీ, ఈసీబీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



