Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుదాత సహకారంతో విద్యార్థులకు ఐడి కార్డులు

దాత సహకారంతో విద్యార్థులకు ఐడి కార్డులు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఐడి కార్డులను అందజేశారు. గ్రామానికి చెందిన పాలెపు ముత్తెన్న సొంతంగా రూ.13వేల 500 వెచ్చించి పాఠశాలలో చదువుతున్న 210 విద్యార్థులకు ఐడి కార్డులు చేయించారు. అట్టి ఐడి కార్డ్ లను పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులకు సొంతంగా ఐడి కార్డులు తయారు చేయించి అందించిన పాలెపు ముత్తెన్నకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తోపారం శివానంద్, కార్యదర్శి నేల హరీష్, బైకాన్ ముఖేష్, బైకన్ మహేష్, డాక్టర్ మురళి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న, సభ్యులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -