పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డీలిమిటేషన్ అయితే 40నుంచి 50 సీట్లు మహిళలవేనని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలనీ, యువతను ప్రోత్సాహించాలని సూచిం చారు. జిల్లా నుండి నలుగురు లేదా ఐదుగురికి నామి నేటెడ్ పదవుల్లో స్థానం కల్పిస్తామని తెలిపారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టి, మహిళా సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడాలని సూచించారు. పార్టీ నిర్మాణంలో మహిళలది కీలక పాత్రని చెప్పారు. కార్య క్రమ్మలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
డీ లిమిటేషన్ అయితే 40 నుండి 50 సీట్లు మహిళకే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



