కూరలో ఉప్పు ఎక్కువైతే.. చాలా కంగారు పడతాం. అంత కష్టపడి చేసిన కూర వేస్ట్ అయిపోతుంది. అలాకాకుండా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కూరలకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం. కొబ్బరి పాలు: కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే.. ఈ సారి కొబ్బరి పాలు కలపండి. కొబ్బరి పాలను కూరల్లో వేస్తే.. ఉప్పు తగ్గడమే కాకుండా టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. కొబ్బరి పాలను వేసి కూరను సిమ్‌లో పెట్టి ఉడికించండి. కొబ్బరి పాలు చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
బంగాళ దుంపలు: కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే.. బంగళా దుంపల్ని ఉడికించి .. కూరలో కలిపేయండి. కూరలో ఉన్న ఉప్పు ఆలూ పీల్చుకుంటుంది. దీంతో కూరలో సాల్ట్ నార్మల్ గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూరకు రుచి పెరుగుతుంది.
గోధుమ పిండి: గోధుమ పిండితో కూడా ఉప్పును తగ్గించుకోవచ్చు. గోధుమ పిండి కొద్దిగా గిన్నెలోకి తీసుకుని.. నీళ్లు వేసి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను కూరలో వేసి ఓ ఐదు లేదా పది నిమిషాలు అలా వదిలేయండి. ఉండలు వేశాక కూరని వేడి చేయకూడదు. కూరలో ఉన్న ఉప్పు అంతా గోధుమ పిండి ఉండలు పీల్చేస్తాయి.
ఉల్లిపాయ లేదా టమోటా: ఉల్లి పాయలు లేదా టమాటాలను నూనె వేసి ఓ పాన్ లో బాగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ పట్టి కూరలో వేసి బాగా ఉడక నివ్వాలి. ఇలా చేస్తే ఉప్పు తగ్గడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది.
ఉప్పు ఎక్కువైతే…
- Advertisement -
- Advertisement -