Saturday, September 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్వేతనలు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు

వేతనలు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రిమ్స్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే ఉద్యమలు తప్పవని ఏఐటీయూసీ అనుబంధం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్లర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. శనివారం ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ముజీప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ..గత మూడు సంవత్సరాలనుండి ప్రతి నెల 10 లోపు రిమ్స్ కార్మికులకు అకౌంట్లో వేతనాలు పడేవన్నారు. కానీ గత నెల వేతనాలు ఈ నెల 23వ తేదీ అయిన వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

కావున వెంటనే రిమ్స్ డైరెక్టర్ కానీ కాంట్రాక్టర్ కానీ వేతనాలు వచ్చే బుధవారం లోపు పెండింగ్ వేతనాలు కార్మికుల అకౌంట్ లో వేయక పోతే గురువారం నుండి ఉద్యమాలు తప్పవని రిమ్స్ డైరెక్టర్, సంబంధిత కృష్ణ కాంట్రాక్టర్ కు హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ రిమ్స్ బ్రాంచ్ అధ్యక్షురాలు జి.సంగీత, యూనియన్ జిల్లా నాయకులు మంగమ్మ, వెంకటేష్ పోలసాని, కమలమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -