- Advertisement -
ప్రచారంలో దూసుకెళుతున్న నాచారం సర్పంచ్ అభ్యర్థి.. చేవూరి స్వప్న-రాజేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామ సర్పంచ్ గా అవకాశమిచ్చి గెలిపిస్తే నాయకులుగా కాకుండా సేవకులుగా పని చేస్తామని గ్రామ సర్పంచ్ స్వతంత్ర్య అభ్యర్థి చేవూరి స్వప్న-రాజేందర్ అన్నారు. ప్రచారంలో భాగంగా వాడవాడకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమను ఆదరించి తమ బ్యాట్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తాగునీటి సమస్య, భూ సమస్యలు, మల్లన్న గుట్టతోపాటు పలు ఆలయాల అభివృద్ధి, యువతకు ఓపెన్ జిమ్, మహిళలకు కుట్టు మిషన్లు, పాలకేంద్రం, జిపిలో ప్రిజర్ బాక్స్ ఏర్పాటు, వీది లైట్స్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు చేస్తామన్నారు.
- Advertisement -



