Wednesday, December 10, 2025
E-PAPER
Homeమానవిఇలా చేస్తే….

ఇలా చేస్తే….

- Advertisement -

శీతాకాలం అంటే చల్లదనం… తాజాదనం.. అయితే, ఇది మన చర్మానికి, ముఖ్యంగా మన పాదాల చర్మానికి కూడా పెద్ధ సమస్యగా మారుతుంది. శీతాకాలంలో తేమ లేకపోవడం, చల్లని గాలులు మన పాదాల చర్మం పొడిగా, పగుళ్లురావడం, నిర్జీవంగా మారడానికి కారణమవుతాయి. వివిధ క్రీములు, లోషన్లు, ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. కానీ, ఇది సరిపోదు. సమస్య తిరిగి మళ్లీ మొదటికే వస్తుంది. మీరు కూడా చలికాలంలో పాదాల పగుళ్లు, నిర్జీవంగా కనిపించే సమస్యలతో ఇబ్బంది పడితే.. ఈ చిట్కాను పాటించండి.
ఇందుకు… ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల ప్యాక్‌ ఒకటి ఉంది. దీనికోసం వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు మాత్రమే అవసరం. బియ్యం పిండి, నిమ్మరసం, బాడీ వాష్‌, కొబ్బరి నూనె. వీటితో ఈ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో చూద్దాం..
ముందుగా ఒక గిన్నెలో ఒక చెంచా బియ్యం పిండి తీసుకోండి. అందులో సగం నిమ్మకాయ చెక్క రసం పిండుకోవాలి. ఒక చెంచా బాడీ వాష్‌, రెండు చెంచాల కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ పదార్థాలను బాగా కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీ పాదాలకు ప్యాక్‌లా వేసుకోవాలి.
మీ పాదాలకు ఈ ప్యాక్‌ వేసుకోవడానికి ముందుగా మీ పాదాలను బాగా శుభ్రం చేసుకోండి. తరువాత, మాస్క్‌ ను మీ పాదాలకు అప్లై చేయండి. 15-20 నిమిషాలు ఆరనివ్వండి. మాస్క్‌ ఆరిన తర్వాత పాదాలను శుభ్రంగా కడగాలి. చివరగా, ఏదైనా మాయిశ్చరైజర్‌ అప్లై చేయండి. తరచూ ఇలా చేయటం వల్ల మీ పాదాలు అందంగా, మదువుగా కనిపిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -