కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే గుడ్డు రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా గుడ్లను రోజూ బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌లో తీసుకుంటూ ఉంటాం. అల్పాహారంగా గుడ్లు తింటే ఎక్కువసేపు ఆకలి అనిపించదు. కానీ గుడ్లు ఉడకబెట్టేట ప్పుడు ఒక్కోసారి పగిలిపోవడం, పొట్టు సరిగా రాకపోవడం వంటి సమస్యలు వేదిస్తుంటాయి. గుడ్లు ఉడకబెట్టడంలో చాలా మంది చేసే చిన్న పొరపాట్ల వల్ల గుడ్డు పగుళ్లకు దారితీస్తాయి. కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే గుడ్లను సరిగ్గా ఉడికించుకోవచ్చు.
సింపుల్ చిట్కాలు..
వెడల్పాటి పాత్రలో ఉడికించాలి..రెండు గుడ్లు ఉడకబెడు తున్న ట్లయితే, వెడల్పాటి పాత్రను ఎంచుకోవాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు వండేటప్పుడు ిన్న పాత్రలో ఉడికిస్తే, అవి ఒకదానికొకటి తాకి పగిలిపోయే అవకాశం ఉంది. గుడ్లు ఒకదానికొకటి తాకకుండా వెడల్పాటి గిన్నెలో ఉడికించాలి.
ఫ్రిజ్ నుండి తీసివేసిన వెంటనే ఉడికించవద్దు..
గుడ్లును ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వాటిని నేరుగా ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. వీటిని ఫ్రిజ్ నుంచి తీసిన తర్వాత నేరుగా నీళ్లలో వేసి మరిగిస్తే కచ్చితంగా పగుళ్లు వస్తాయి. కాబట్టి మొదట ఫ్రిజ్ నుంచి గుడ్లను తీసి, గది ఉష్ణోగ్రత వద్ద 10 లేదా 15 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి. అప్పుడు వాటి ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుం టుంది. ఆ తర్వాత ఉడకబెట్టడం మంచిది.
మరిగే నీటిలో ఉప్పు కలపాలి
కొన్నిసార్లు గుడ్డు సరిగ్గా ఉడకబెట్టిన తర్వాత కూడా పొట్టు సరిగ్గా ఊడి రాదు. అలాంటప్పుడు గుడ్లు ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు నీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి తొక్కలు సులభంగా ఊడి వస్తాయి.
మీడియం మంట మీద ఉడికించాలి..
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మంట ఎక్కువగా ఉండకూడదు. గుడ్డు ఎప్పుడూ మీడియం మంట మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు పగలదు. అంతేకాకుండా పై తొక్క సులభంగా వస్తుంది.