నవతెలంగాణ – హైదరాబాద్ : సంతకాల ఫోర్జరీ కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని సిఐడి విచారణకు హాజరుకావాలని కోల్ కతా హైకోర్టు గురువారం ఆదేశించింది. విచారణకు హాజరైనంతకాలం ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది. ఆయనకు అరెస్టు నుండి మూడు వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పించింది.
రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సోవన్‌దేబ్ చటోపాధ్యాయను ప్రతిపాదిస్తూ మే 20న స్పీకర్ కు సమర్పించిన లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ టిఎంసి ఎమ్మెల్యేలు రితబత్ర బెనర్జీ, సందీపన్ సాహా చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన సిఐడి.. అభిషేక్ బెనర్జీకి పలుమార్లు సమన్లు జారీ చేసింది. అనారోగ్య కారణాల రిత్యా తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, 15 రోజుల గడువు కావాలని అభిషేక్ బెనర్జీ కోరారు. సిఐడి చేపట్టిన సోదాల చట్టబద్ధతను సవాలు చేస్తూ టిఎంసి బుధవారం కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. కోల్ కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో మాజీ సిఎం మమతా బెనర్జీ నివాసానికి ఆనుకుని ఉన్న పార్టీ కార్యాలయంలో జూన్ 9న సిఐడి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ షాక్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



